విశాఖపట్నంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. గాజువాకలో ఉన్న కన్య శ్రీ కన్య థియేటర్‌పై నున్న సెల్ టవర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి..
విశాఖపట్నంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. గాజువాకలో ఉన్న కన్య శ్రీ కన్య థియేటర్‌పై నున్న సెల్ టవర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి.. క్షణాల్లోనే అగ్నికీలలు థియేటర్ మొత్తం వ్యాపించాయి.. ఈ ప్రమాదంలో రెండు స్క్రీన్లు కాలి బూడిదయ్యాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకుని సుమారు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతం మొత్తం నల్లటి పొగ దట్టంగా పరుచుకుంది. దీంతో థియేటర్ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
