అగ్నికి ఆహుతైన యాగశాల

ద‌క్షిణ‌ కాశీగా ప్ర‌సిద్ధిగాంచిన శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌ర ఆల‌య మ‌హాకుంభాభిషేక మ‌హోత్స‌వాల్లో అప‌శృతి చోటు చేసుకుంది. మ‌హాకుంభాభిషేక మ‌హోత్స‌వాల తొలిరోజే అగ్నిదేవుడు ఆగ్ర‌హించాడు.

విద్యుత్ షార్ట్ స‌ర్కూట్ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో యాగ‌శాల‌ అగ్ని కి ఆహుతి అయింది. మ‌హాకుంభాభిషేక మ‌హోత్స‌వాల్లో భాగంగా ఈ రోజు (శ‌నివారం ) ఉద‌యం 8గంట‌ల‌కు ఆచార్య‌వ‌ర‌ణం, మేనా మ‌ర్యాద‌లు, యాగాలంకారం, ర‌క్షాబంధ‌నం జ‌రిగాయి.

సాయంత్రం ,రాత్రి కుంభాలంకారం, కలాపాకర్షణ, బాలయ విసర్జన, యాగప్రవేశం, కుంభస్థాపన, ప్రథమకాల యాగపూత, అగ్ని కార్యం, పూర్ణాహుతి, నైవద్యం వగైరాలు జరగాల్సి ఉంది.అయితే, అగ్ని ప్రమాదం వల్లఈ కార్యక్రమాలన్నీజరుతాయో లేదో చెప్పలేమని ఆలయ అధికారలు చెబుతున్నారు