మంత్రి నారాలోకేష్ ను సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ దుమ్ము దులిపేశారు. అపరిపక్వతతో నంది అవార్డుల గురించి మాట్లాడకూడదంటూ సలహా కూడా ఇచ్చారు లేండి. ఎందుకంటే, లోకేష్ ఏమి మాట్లాడినా తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి ముందు ఆలోచించాలంటూ సూచించారు. నోటికొచ్చింది మాట్లాడేసి చంద్రబాబు పరువు తీయొద్దన్నారు. ప్రభుత్వం ప్రకటిచింది నంది అవార్డులనే కానీ ఆధార్ అవార్డులను కాదని ఎద్దేవా చేశారు.

నంది అవార్డులు అందుకునే వారికి ఆధార్ కార్డులు కూడా ఉండాలని నిబంధన విధిస్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తామన్నారు. నంది అవార్డులు ఇవ్వటమన్నది తెలుగు సినిమాలకే కానీ ఆధార్ కార్డులున్న వారికి కాదన్నారు. ఆధార్ కార్డుల గురించి మాట్లాడుతున్న లోకేష్ మొన్నటి వరకూ చంద్రబాబు, లోకేష్ కు ఆధార్ కార్డులు ఎక్కడున్నాయంటూ ధ్వజమెత్తారు. ఇదే విషయమై మాట్లాడిన చంద్రబాబు అవార్డల ఎంపికకు ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని హుందాగా మాట్లాడితే లోకేష్ మాత్రం అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నట్లు అభిప్రాయపడ్డారు.

అసలు అవార్డులు గురించి మాట్లాడే అర్హతే లోకేష్ కు లేదని తేల్చేశారు. బాధ్యత కలిగిన మంత్రి హోదాలో లోకేష్ మాట్లాడాల్సిన మాటలు కావంటూ భరద్వాజ విరుచుకుపడ్డారు. ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు విషయం పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు.