మూడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో బలవంతంగా బొప్పాయి తినిపించి, గర్భవిచ్చిత్తికి ప్రయత్నించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
అనంతపురం : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుడ్డంపల్లి గ్రామంలో ఓ తండ్రి గత మూడేళ్లుగా తన కుమార్తె మీద లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో.. బొప్పాయి పండు తినిపించి అబార్షన్ అయ్యేలా చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక
బాధితురాలు ఓ ఎన్జీవోను ఆశ్రయించడంతో.. వారు ఆమెను రక్షించారు. పోలీసులకు సమాచారం అందించి.. తండ్రిని అరెస్టు చేయించారు.
గుడ్డంపల్లి గ్రామంలో గొర్రెల కాపరి కుటుంబం నివాసం ఉంటోందని పోలీసులు తెలిపారు. భార్య పక్కనే ఉన్న అడవుల్లో గొర్రెలను మేపడానికి వెళ్లిన సమయంలో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురి మీద అఘాయిత్యానికి పాల్పడేవాడు తండ్రి. దీంతో బాలిక ఆరు నెలల క్రితం గర్భవతి అయ్యింది. ఆ గర్భాన్ని తొలగించేందుకు బొప్పాయి పండు తినమని తండ్రి బలవంతం చేశాడు. దీంతో కూతురు ఆర్డీటీ సిబ్బందిని ఆశ్రయించింది. తన తండ్రి నుంచి రక్షించాలని వేడుకుంది.
శనివారం సాయంత్రం ఆర్డీటీ బృందం గ్రామానికి వెళ్లి అనంతరం మడకశిర పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తండ్రిని అరెస్ట్ చేశారు. బాలికను రెస్క్యూ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ.. విభేదాలతో రచ్చ.. సింగరాయకొండలో టెన్షన్ వాతావరణం..
ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో వరంగల్ లో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీలో మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల కుమార్తె మీద అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడో కామాంధుడైన తండ్రి. ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యలు గర్బవతి అని చెప్పడంతో.. ఘటన వెలుగులోకి వచ్చింది.
మిల్స్ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గత నెల రోజులుగా మైనర్ అయిన కూతురు మీద పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్న తల్లి తన బిడ్డను గట్టిగా ప్రశ్నించగా ఆమ అసలు విషయం తెలిపింది.తన తండ్రి మత్తులో ఉన్నప్పుడు తనను చాలాసార్లు లైంగికంగా వేధించాడని వెల్లడించింది.
ఈ లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే.. మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడని, భయపడి ఎవ్వరికీ చెప్పలేదని ఆమె పేర్కొంది. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతని మీద ఐపీసీ సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆ కీచకతండ్రిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
