మచిలీపట్నం: కన్న కూతురు మరణాన్ని తట్టుకోలేక  కూతురి సమాధి వద్దే ఓ తండ్రి కన్నుమూశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో చోటు చేసుకొంది.

దేవి దేవి అనే వాడు ఆ భ్రమలో ఉండేవాడు. సమాధి దగ్గరే చనిపోయాడు. మచిలీపట్నంలో గిరిబాబు అనే వ్యక్తికి భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద కూతురు రేణుకాదేవికి కొంత కాలం క్రితం పెళ్లి కూడ చేశాడు. అయితే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుకాదేవి మరణించింది.

ఏడు మాసాల క్రితం రేణుకాదేవి మరణించింది. మచిలీపట్నంలోనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడే సమాధిని నిర్మించారు.పెద్ద కూతురు మరణించిన  నుండి గిరిబాబు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

ప్రతి క్షణం చనిపోయిన కూతురి గురించి మదనపడేవాడని కుటుంబసభ్యులు చెప్పారు.  ఈ నెల 24వ తేదీన గిరిబాబు కూతురు సమాధి వద్దకు వెళ్లాడు. అప్పటి నుండి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆయన కోసం వెతికారు. కూతురి సమాధి వద్దే  గిరిబాబు  అచేతనంగా పడిఉన్నాడు. ఆసుపత్రికి తరలిస్తే ఆయన చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.

సమాధి వద్ద ఏం జరిగిందో తమకు తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏడు మాసాల వ్యవధిలోనే కూతురు. భర్త మరణించడంతో ఆ తల్లీ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.