ఏపీలోని శ్రీసత్య సాయి జిల్లో లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దంపతులు మరణించారు. వారి బంధువు కూడా ఒకరు చనిపోయారు. ఇద్దరు పిల్లలు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డివైడర్ ను కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరు సాప్ట్ వేర్ ఇంజనీర్లు. వీరిద్దరూ భార్యాభార్తలు. మరొకరు వీరి బంధువు. ఈ ప్రమాద బాధితులంతా తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన వారు.
వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కు చెందిన రమ్య, గోపీనాథ్ భార్యాభర్తలు . వీరిద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గా పని చేస్తున్నారు. వీరు తమ ఇద్దరు పిల్లలైన సాహిత్, హాసినిని తీసుకొని కారులో బెంగళూరుకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. ఆ సమయంలో వారి వెంట మరో బంధువు తారకేశ్వరి కూడా ఉన్నారు.
అపోలో ఆస్పత్రిలో మాజీ మంత్రి కొడాలి నానికి చికిత్స.. అసలేం జరిగిందంటే..?
ఈ క్రమంలో కారు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా పర్వతదేవరపల్లి వద్దకు చేరుకుంది. అయితే ఈ సమయంలో ఆ వాహనం అదుపుతప్పి డివైడర్ ను బలంగా తాకింది. ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్ వేర్ దంపతులు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ముగ్గురికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ.. బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి..!
హాస్పిటల్ కు తీసుకెళ్లిన తరువాత చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో తారకేశ్వరి (62) చనిపోయారు. సాహిత్, హాసినినికి డాక్టర్లు ట్రీట్ మెంట్ అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.
