ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆయనకు గత రాత్రి ఆపరేషన్ జరిగినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. 

రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కొడాలి నానికి సూచించినట్టుగా తెలుస్తోంది. 15 రోజుల తర్వాత ఆయనకు వైద్యులు కిడ్నీ సంబంధిత లేజర్ ట్రీట్‌మెంట్ చేయనున్నట్టుగా సమాచారం.