పల్నాడు జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు ఆత్మహత్య
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఇంద్రారెడ్డి ఆయన భార్య శివలింగేశ్వరి పిల్లలు సాయిరెడ్డి, జితిన్ రెడ్డిగా గుర్తించారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఇంద్రారెడ్డి ఆయన భార్య శివలింగేశ్వరి పిల్లలు సాయిరెడ్డి, జితిన్ రెడ్డిగా గుర్తించారు. అయితే కుటుంబ కలహాల వల్లే వారు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా వీరి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.