ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఉలవపాడులో విషాద సంఘటన జరిగింది. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. 

ఉలవపాడు రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌పామ్‌ చివరలో చాలా సేపు కూర్చున్న కుటుంబ సభ్యులు ఆ మార్గంలో వచ్చిన సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ కిందికి దూకారు. మృతుల్లో భార్య, భర్త నలుగురు పిల్లలు ఉన్నారు. 
భార్యాభర్తల వయసు 30-35 సంవత్సల మధ్య ఉంటుందని రైల్వే పోలీసులు చెప్పారు. మృతుల్లో 9 నెలల నుంచి ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.