రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించి వారిని మోసం చేసిన ఘటనలకు లెక్కలేదు. ఈ క్రమంలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఎరువులను తయారుచేసి విక్రయిస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఉప్పుకు రంగు కలిపి పోటాష్ పేరుతో విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు  త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో 624 బస్తాల నకిలీ ఎరువును సీజ్ చేశారు. మైసూర్ కేంద్రంగా తయారు చేసిన నకిలీ ఎరువులను కడపలో విక్రయిస్తున్నట్టుగా అధికారుల విచారణలో తేలింది.