షాపు ఓనర్ అనుమానం.. కదిలిన డొంక, గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్లను (fake currency ) చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు (guntur police) రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. 

fake currency gang busted by guntur police

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్లను (fake currency ) చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు (guntur police) రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రెండురోజుల క్రితం గుంటూరు జిల్లా మేడికొండూరు (medikonduru) గ్రామంలోని ఓ దుకాణాదారుడు వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సరుకులు కొనుగోలు చేసి రూ.200నోటును ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ నోటు అనుమానాస్పదంగా వుండటంతో దుకాణ యజమాని మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read:దేశంలో దొంగ నోట్లు....అన్నీ 2000 వేల నోట్లే...

అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు గుంటూరు జిల్లాకు చెందిన ఒకరిని, అనంతరం మరొకరిని అదుపులోకి తీసుకుని విచారించగా డొంక కదిలింది.  తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి గుంటూరులో నెలరోజులుగా కలర్‌ జిరాక్స్‌ సహాయంతో రూ.100, 200, 500 నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నారని పోలీసులు వివరించారు. ఇప్పటి వరకు లక్షల్లోనే ఈ నోట్లను చలామణి చేశారని పోలీసులు పేర్కొన్నారు. పట్టుకున్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios