Asianet News TeluguAsianet News Telugu

ఇక్కడ ఫ్లెక్సీలను ముట్టుకుంటే ఫినిష్

  • అనంతపురం జిల్లా ధర్మవరంలో బుసుకొడుతున్న ఫ్యాక్షన్ పాలిటిక్స్
  • గొడవలు సృష్టించి ఫ్లె క్సీలను తొలగించకుండా భద్రత  కల్పించిన పోలీసులు
Faction politics resurface in Anantapuram district

చాలా కాలం తర్వాత అనంతపురం జిల్లా ధర్మవరంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలకు పోలీసు భద్రత కల్పిస్తున్నారు. అక్కడి తెలుగుదేశంలోని వర్గ పోరు  ఫ్లెక్సీల  వల్ల  చిలికి చిలికి  పట్టణంలో  144 సెక్షన్ విధించే దాకా వచ్చింది. గొడవలకు కారణమయిన  ఫ్లెక్సీబోర్డులకు పోలీసు భద్రత వూరంతాబందోబస్తు పెంచడంతో ధర్మవరంలో పాతరోజులు వస్తున్నాయమో అనే ఆందోళన ప్రజలలో మొదలయింది. 

 

అనుయాయులు నాయకుల కోసం  పెట్టే ఫ్లెక్సీలు నాయకుడితో సమానం కాబట్టి వాటికి ప్రత్యర్థులు హాని చేయకుండా అంటే చించేయకుండా కాపాడే పనిలో ధర్మవరం పోలీసుల పడిపోయారు. గొడవలు చేస్తున్నారని  ఎవరినయినా అరెస్టు చేయగలరు  గాని, గొడవకు కారణమయిన రూలింగ్ పార్టీ వారి ఫ్లెక్సీబోర్డులు తీసేయడం సాధ్యం కాదు. అందువల్ల రక్షణ ఇవ్వడం సులభమని పోలీసు భావిస్తున్నారు.

 

 ధర్మవరంలో ఫ్యాక్షన్ టెన్షన్ ఎదురుకాక దాదాపు పదేళ్లకు పైబడి అయివుం టుందేమో. ఎపుడో  పరిటాల రవి  బతికి ఉన్న రోజులలో,  ప్రత్యర్థులు కూడా బలంగా ఉన్న రోజులలో  ధర్మవరం రాజకీయ, కుల కక్షలకు, కార్పణ్యాలకు కేంద్రంగా ఉండింది.లెక్క లేనన్ని హత్యలు జరిగేవి. అపుడు వైరి వర్గాలు కాంగ్రెస్ , టిడిపిలలో ఉండేవి. రవి హత్యానంతరం  జిల్లాలో ఫాక్షన్  పాలిటిక్స్ దాదాపు కనుమరుగయ్యాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు లోలోపలే ఉన్నాయోమో గాని, బయటపడలేదు.ఇపుడు కాంగ్రెస్ లేదు.

 

రెండు వర్గాలుటిడిపిలోనే ఉంటున్నాయి. ఎపుడయిన సరే అవి  ఏ చిన్న కారణానయినా సరే  అవి పెట్రేగి పోవచ్చు.  వీటి తాలుకు సూచనలు అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య  జరుగుతున్న గొడవలు. ఇదేవిధంగా  ఇపుడు తాజాగా ధర్మవరం ప్రాంతంలో మంత్రి పరిటాల సునీత వర్గానికి  ఎమ్మెల్యే గొనుగోంట్ల సూర్యనారాయణ వర్గానికి మొదలయింది. ఒకఫ్లెక్సి పోటో లేకపోవడం తో  ఈ గొడవ మొదలయినా పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసిన   ఈ వివాదం మూలా సాంప్రదాయిక ఫ్యాక్షన్ రాజకీయాలలో  ఉన్నాయి.

 

ధర్మవరం  పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ల ఫొటోలతో బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన జగ్గు అనే టీడీపీ నాయకుడు ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. అయితే ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే  వరదాపురం సూర్యనారాయణ ఫొటోలేక పోవడం వివాదానికి దారి తీసింది. ఇది చూసిన ఎమ్మెల్యే అనుచరులకు ఆగ్రహంతో తమ నేత ఫొటో లేని ఫ్లెక్సీ అక్కడ ఉంచరాదంటూ తొలగించేందుకు ప్రయత్నించారు.  పరిటాల వర్గీయులు దీనిని అడ్డుకోవడం గొడవకు దారితీసింది.  తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. భారీఎత్తున జనాలు గుమికూడారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు మంత్రి ఫ్లెక్సీ ఉంచేదే లేదన్నారు. పోలీసుల ఎదుటే ముష్టి యుద్ధానికి దిగారు. చొక్కాలు చించుకున్నారు.  పిడిగుద్దులు గుద్దుకున్నారు. తోపులాటలో ఫ్లెక్సీ  కొంత చినిగిపోయింది. పరిటాల వర్గీయులు ధర్నా చేశారు.

పట్టణంలో ఉద్రిక్తతకు కారణమయిన ఇరు వర్గాలు  రూలింగ్ పార్టీయే కావడం పోలీసులను ఇబ్బంది పెట్టింది. ఒక వర్గం మంత్రిది, మరొకటి  ఎమ్మెల్యేది. దీనితో ఏమీ చేయలేక ఫ్లెక్సీలకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

 





 

Follow Us:
Download App:
  • android
  • ios