గుంటూరులో వ్యక్తి మిస్సింగ్ కేసు మిస్టరీ.. భార్యకు విడాకులిచ్చి, ఆమె స్నేహితురాలితో ఫ్రెండ్షిప్.. దీంతోనే...

గుంటూరులో  ఓ వ్యక్తి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. కనిపించకుండా పోయిన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే దీనికి వివాహేతర సంబంధమే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

extra marital affair : man missing case goes mystery in gutur

గుంటూరు : వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన నూతక్కి ravikiran అనే యువకుడి అదృశ్యం ఇప్పుడు mysteryగా మారింది. missing caseగా నమోదు చేసిన పోలీసులు, అతడు murderకు గురైనట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చారని సమాచారం. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని, తెనాలిలోని ఓ రౌడీషీటరు, అతడి సహచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూల్పురుకు చెందిన నూతక్కి రవికిరణ్ తెనాలిలోని ఓ ప్రైవేటు నెట్ వర్క్ లో టెక్నీషియన్ గా చేస్తున్నాడు. గత నెల 20వ అతడు అదృశ్యమయ్యాడు. 

అప్పట్నుంచి తల్లిదండ్రులు రవికిరణ్ ఆచూకీ కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో గతనెల 26న అమృతలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. రవికిరణ్ తెనాలిలో హత్యకు గురయ్యాడని వాళ్లు అనుమానించారు. అమృతలూరు పోలీసుల విచారణపైనా వారు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రవికిరణ్ తల్లి సువార్తమ్మా నుంచి స్టేట్ మెంట్ ను తీసుకుని హత్య కోణంలో దర్యాప్తు చేయసాగారు. రవికిరణ్ వివాహితుడు.

తెనాలిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తున్న భార్యతో అతడికి విభేదాలొచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. అదే నర్సింగ్ హోంలో నర్సుగా చేస్తున్న భార్య స్నేహితురాలైన మరో యువతితో రవికిరణ్ కు సాన్నిహిత్యం పెరిగింది. తెనాలికి చెందిన ఓ రౌడీ షీటర్ ఆ యువతి ద్వారానే గత నెల 20న రవికిరణ్ కి ఫోన్ చేయించి పిలిపించారని ఆ తర్వాత అతడు అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

తెనాలి యువతితో సంబంధమున్నరౌడీ షీటర్ రవికిరణ్ ను  కొట్టడంతో అతడు చనిపోయాడని, శవాన్ని మాయం చేశారని చెబుతున్నారు. పోలీసులతోనూ ఇదే విషయం చెప్పారు. దీనిపై పోలీసులు రౌడీషీటర్, ఆ యువతిని, వారికి సహకరించిన మరికొందరిని విచారిస్తున్నట్లు సమాచారం ఫోన్ కాల్స్, వారు సంచరించిన ప్రదేశాలు దాదాపుగా ట్రేస్ అయ్యాయని, ఇక భౌతిక సాక్ష్యాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయమై చుండూరు సీఐ కళ్యాణ్ రాజ్ వివరణ కోరగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

ఇదిలా ఉండగా, 

Gorakhpurలో ఐఐటి పూర్వ విద్యార్థి, Chemical Engineer వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఆలయ సెక్యూరిటీపై దాడికి తెగబడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. IIT ముంబై నుంచి 2015లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన అహ్మద్ ముర్టాజా అబ్బాసీ  కొద్దిరోజుల క్రితమే స్వస్థలమైన గోరక్ పూర్ వచ్చాడు.  అయితే ఆదివారం రాత్రి స్థానిక గోరఖ్నాథ్ ఆలయం వద్ద ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు,  స్థానికులు తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో అతనిపై రాళ్ల దాడి చేశారు. 

ఆ తర్వాత అతడిని వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా,ఈ ఘటనపై యూపీ Anti-Terrorist Squad సోమవారం దర్యాప్తు ప్రారంభించింది. ముంబై నుంచి అబ్బాసీ గోరఖ్ నాథ్ ఆలయం వద్దకు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటున్నటు గోరక్ పూర్ ఏడీజీ అఖిల్ కుమార్ తెలిపారు. దర్యాప్తు కోసం నాలుగు పోలీసు బృందాలను నియమించినట్టు పేర్కొన్నారు. అయితే 2015 నుంచి తన కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ముర్టాజా అబ్బాసీ తండ్రి మహ్మద్ మునీర్ వెల్లడించారు. దీనివల్ల అతడి వివాహం కూడా రద్దయినట్లు తెలిపారు. నగరంతో పాటు అహ్మదాబాద్ లోని పలు ఆసుపత్రిలో అతడికి చికిత్స చేయించినట్లు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios