కరోనా వైరస్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా వంటి కష్టమైన పరిస్థితిని తన జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. పాపం బాగా పెరిగినప్పుడు.. ప్రకృతి, దేవుడు ఇలాంటిది ఒకటి సృష్టించి జనాలను తగ్గిస్తుంటారని.. ఇప్పుడు కూడా అందుకే కరోనా వైరస్ ని సృష్టించారని ఆయన పేర్కొన్నాడు.

ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటివి జరుగుతున్నాయని.. పాపం అంటే చంపడం, నరకడం కాదు.. దుర్మార్గమైన వాతావరణాన్ని సృష్టించడమన్నారు. దేవుడు, ప్రకృతి దానంతట అదే కేర్ తీసుకుంటుంది అన్నారు. 

Also read అందుకోసమే నా అరెస్ట్... న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: నిమ్మల రామానాయుడు...

కొంత కంట్రోల్ చేయడానికి చూస్తుందని.. ఇంతటి పెద్ద విపత్తు ఎవరూ చూడలేదన్నారు. ఇది మానవ జాతికి ఓ హెచ్చరిక.. శుభ్రంగా ఉండాలని ప్రకృతిహెచ్చరిస్తోందని జేసీ పేర్కొన్నాడు.

కరోనా నియంత్ర కోసం పోలీసులు, డాక్టర్లు బాగా పోరాడుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. దీన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం కరోనాను ఉపయోగించుకోవడం పద్దతి కాదన్నారు. 

ప్రధాని మోదీ కూడా కరోనాను కట్టడి చేసేందుకు చాలా కష్టపడుతున్నారని.. అయినా తప్పు జరిగితే ప్రజలదే తప్ప.. ప్రభుత్వాలది కాదన్నారు. ఏది ఏమైనా ఈ మహమ్మారి నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు.

ఇక ప్రభుత్వ అధినేతలు, పార్టీ అధినేతలు ఒకటి గమనించాలని.. డబ్బిస్తేనే ఓట్లు వస్తాయనడం సరికాదన్నారు మాజీ ఎంపీ. చంద్రబాబు ఎన్నికలకు ముందు పదివేలు సాయం చేశారని.. చంద్రబాబుకు ఓట్లు వేస్తారనుకున్నానని.. కానీ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను అన్నారు. ఈ నవరత్నాల వల్ల ఏదో సాధిస్తామనుకుంటున్నారు.. ఏదీ సాధించలేరన్నారు దివాకర్‌రెడ్డి.