కాకినాడ: మాజీ ఎమ్మెల్యే గాదం కమలాదేవి(86) గురువారం ఉదయం మృతిచెందారు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను కాకినాడలోగల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతిచెందారు. 

1972లో పామర్రు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున కమలాదేవి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా, టీటీడీ సభ్యురాలిగా, క్వాయర్ బోర్డ్ సభ్యురాలిగానూ ఆమె పనిచేశారు. 

ఆమెకు రమేష్, మహేష్, హరీష్ అనే ముగ్గురు కుమారులున్నాయి. అనురాధ అనే కూతురు ఉంది. పిఎస్ చైర్ పర్సన్ గా కూడా ఆమె పనిచేశారు. కమలా దేవి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.