గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చవిచూసింది. వైసీపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ఆ నాటి నుంచి టీడీపీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో కొందరు ముఖ్య నేతలు టీడీపీ ని వీడి వైసీపీలో చేరగా... తాజాగా  మరో కీలక నేత జగన్ గూటికి చేరారు. 

Also Read కడప జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ: వైసీపిలోకి మైనారిటీ నేత...

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణణ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, మాజీ కార్పొరేటర్ పీఎల్ఎస్ఎస్ ప్రసాద్, టీఎస్ఎన్ మూర్తి, రజక సంఘం నార్త్ అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీలో చేరారు.

వీరికి ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీదే విజయం అన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి చేయడమే సీఎం జగన్ ముందు ఉన్న లక్ష్యమని చెప్పారు. విశాఖను పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు.