చాలా హడావిడిగా మూడు రాజధానుల బిల్లు (ap three capital bill), సీఆర్‌డీఏ (crda) రద్దు చట్టాలను అసెంబ్లీలో ఉపసంహరణ చేశారని అన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు (vadde sobhanadreeswara rao). వైసీపీ ప్రభుత్వం మళ్ళీ మూడు రాజదానుల బిల్లును ప్రవేశపెట్టినా దాన్ని మళ్ళీ కొట్టి వేస్తారు, ఎందుకంటే అది రాజ్యాంగ వ్యతిరేకమని శోభనాద్రీశ్వరరావు అన్నారు.
చాలా హడావిడిగా మూడు రాజధానుల బిల్లు (ap three capital bill), సీఆర్‌డీఏ (crda) రద్దు చట్టాలను అసెంబ్లీలో ఉపసంహరణ చేశారని అన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు (vadde sobhanadreeswara rao). విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి (ys jagan) గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ మూడు రాజధానుల బిల్లు తెచ్చామని అన్నారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే బిల్లును ఉపసంహిరించుకోవడం గమనార్హమన్నారు. ఇప్పుడు మళ్లీ మూడు రాజధానులు బిల్లును సవరించి మళ్ళీ ప్రవేశపెడతాం అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి అని తానే అమరావతిని అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు వచ్చి తర్వాత ఎవర్ని అడగకుండా, ఎన్నికల ప్రణాళికలో మూడు రాజధానుల అంశం పెట్టకుండా బిల్లు చేశారని వడ్డే మండిపడ్డారు.
గతంలో కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది అంతేకాని అమరావతికి ప్రజలు వ్యతిరేకం కాబట్టే వైసీపీని గెలిపించారు అని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. ఏ బిల్లులైనా రెండు సభల్లో ఆమోదం పొందితేనే అది చట్టం అవుతుందని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని శోభనాద్రీశ్వరరావు గుర్తుచేశారు. గతంలో దీనిపై వైసీపీ (ysrcp) నాయకులు కౌన్సిల్‌లో సభా నియమాలకు వ్యతిరేకంగా మూడు రాజధానుల బిల్లుకు సెలెక్ట్ కమిటీ ఏర్పడకుండా అడ్డుపడ్డారని ఆయన అన్నారు.
Also Read;జగన్ మరో ట్విస్ట్.. శాసన మండలి రద్దు నుంచి కూడా వెనక్కి, అసెంబ్లీలో బుగ్గన తీర్మానం
అమరావతిలో (amaravathi) అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఈ రెండేళ్లు వైసీపీ నాయకులు గడిపేశారని.. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ లు అనడం సరికాదని వడ్డే హితవు పలికారు. ఇప్పటికే వందల మంది అమరావతి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి వరకూ ప్రభుత్వం వారి కుటుంబాలను పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం మళ్ళీ మూడు రాజదానుల బిల్లును ప్రవేశపెట్టినా దాన్ని మళ్ళీ కొట్టి వేస్తారు, ఎందుకంటే అది రాజ్యాంగ వ్యతిరేకమని శోభనాద్రీశ్వరరావు అన్నారు.
ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సహేతుకంగా ఉండాలని.. అమరావతే శాశ్వత రాజధాని అని కోర్టులు స్పష్టం చేశాయని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకొని అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పి, చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందించాలన్నారు. చంద్రబాబుని (chandrababu )మానసికంగా క్షోభ పెట్టి రాజకీయాల నుంచి తప్పించేలా చేయాలనే ఇలా చేస్తున్నట్టు అనిపిస్తుందని ఆయన ఆరోపించారు.
