ఆంధ్ర ప్రదేశ్ బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  పైడికొండల మాణిక్యాల రావు ఇవాళ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అధికార టిడిపి పార్టీ నాయకులు  అవినీతికి  పాల్పడుతున్నారంటూ ఈయన తీవ్ర ఆరోపణలు చేయడం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో ఇంటి వద్ద జరిగిన సంఘనల కారణంగా మాణిక్యాలరావు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. 

బిజెపి, టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా  మాణిక్యాల రావు ఇంట్లోంచి బైటికిరాకుండా గృహనిర్భంధంలో విధించారు. అయితే ఈ నిర్భంధాన్ని చేధించుకుని బైటకు వచ్చిన ఆయన తీవ్ర ఎండలో రోడ్డుపైనే రెండు గంటలపాటు నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మాణిక్యాలరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 

పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ తో పాటు మరికొంతమంది టిడిపి నాయకులు ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు మాణిక్యాలరావు ఆరోపించారు. తెలుగు దొంగలు ఇలా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై టిడిపి నాయకులు కూడా స్పందించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్దమా అంటూ మాజీ మంత్రికి సవాల్ విసిరారు. 

ఈ విధంగా జిల్లాలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మాణిక్యాలరావు ఇంట్లోంచి బైటికి రాకుండా చర్యలు  తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన సంఘటనల వల్ల మాణిక్యాలరావు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.