ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై విమర్శలు చేశారు. జగన్ మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారనుకునే రకమని  విమర్శించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయమేమీ లేదని లోకేష్ పేర్కొన్నారు.

‘‘జగన్ గారు మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఎం తెస్తారు అనే రకం. ఆయనకు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులపై లేకపోవడం బాధాకరం. గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారు. మరి కాంట్రాక్టర్లపై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా? 

Also Read చిన్న పిల్లల ముడ్డికి తప్ప... కరోనా వార్డులకూ వైసిపి రంగులా..: బుద్దా ఫైర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ  కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చారు. సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్ని రాష్ట్రాల్లో ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారు’’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ బాటలోనే వైసీపీ నేతలు నడుస్తున్నారని.. ఇప్పటికీ 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారని  విమర్శించారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైసీపీ నాయకులు కొట్టేయ్యడం దారుణం' అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందదని నారా లోకేష్ పెదవి విరిచారు. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు'' అంటూ మండిపడ్డారు.