మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హై బిపితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నాలక్ష్మినారాయణ చేరారు. బుధవారం సాయంత్రం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని మాజీ మంత్రి కన్నా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత పరిస్థితులను బట్టి నేటికి పార్టీ మారే కార్యక్రమం వాయిదా పడినట్లే అనిపిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు దక్కలేదనే కారణంతో ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అయితే.. బీజేపీ నుంచి వైసీపీలోకి   మారే విషయంలో  ఆయన తీవ్ర ఒత్తిడికి లోనైతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి కూడా తీవ్ర ఒత్తిడికి గురైన కన్నా .. ఆ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేది వాయిదా పడినట్లే అని సమాచారం.