మంత్రి కొడాలి నాని  కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు.  అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.3వేలు ఇస్తామంటూ ఇచ్చిన తొలి హామీనే వైసీపీ నేతలు తుంగలో తొక్కారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలను వైసీపీ నేతలను ఛీ కొడుతున్నారని అభిప్రాయపడ్డారు. అయినా.. వారిలో మార్పు రావడం లేదని విమర్శించారు.

బూతుశాఖ మంత్రిగా కొడాలి నాని పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. ‘సన్న బియ్యంపైనా మాట తప్పి, ప్రజల్లో చులకనైనా ఆయన తీరు మార్చుకోకపోవడం సిగ్గుచేటు. 8నెలలుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగరోనా వైరస్‌ గురించి మాట్లాడకుండా చంద్రబాబు లక్ష్యంగా కొడాలి నాని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. టీవీల్లో కొడాలి నాని ప్రెస్‌మీట్‌ వస్తుందంటేనే చిన్న పిల్లలున్న ఇళ్లల్లో చానళ్లను మార్చేస్తున్నారు. ఆయన హావభావాలు మాయల పకీరును తలపించేలా ఉన్నాయి. అతను వాడుతున్న భాష, మాట్లాడుతున్న మాటలు చూసి యావత్‌ ప్రజానీకం చీదరించుకుంటోంది.

Also Read ఏ పార్టీలో చేరుతానో త్వరలో వెల్లడిస్తా: జేడీ లక్ష్మీనారాయణ...
 
చివరికి చట్టసభల్లోనూ బూతు పదాలతో చరిత్రకే చెదలు పట్టించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రాష్ట్ర ప్రజలకు గానీ, ఎమ్మెల్యేగా గుడివాడకు కానీ కొడాలి నాని చేసిందేమీ లేదు. ప్రజలను బెదిరించి, బాధించి, వేధించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. రైతుల ఆందోళనలపై మతిభ్రమించి అర్థంకాని విధంగా మాట్లాడుతున్నారు. నోరు అదుపు లో పెట్టుకుని, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే, ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు’ అని జవహర్‌ హెచ్చరించారు