ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్(65) మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. కాగా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ నలంద కిశోర్ ను మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్థరాత్రి అదుపులో తీసుకున్నారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ విచారించి వదిలేశారు.

కాగా.. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కిశోర్ మృతి పట్ల గంటా శ్రీనివాసరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.