Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలోకి మాజీమంత్రి....?

ముక్కుసూటి తనం ఆయన సొంతం. ఏది మనసులో దాచుకోరు....ఏది అనిపిస్తే అది అనేయడం ఆయన స్టైల్. కేబినేట్ లో ఉండి ముఖ్యమంత్రిని తిట్టిన ఘనుడు బహుశా ఆయనే కావచ్చు..సీఎంపై విమర్శలు చేసి చేసి చివరకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు...ఆయనే కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. 

Ex minister D.L.Ravindrareddy ready to join ycp
Author
Kadapa, First Published Aug 22, 2018, 12:39 PM IST

కడప: ముక్కుసూటి తనం ఆయన సొంతం. ఏది మనసులో దాచుకోరు....ఏది అనిపిస్తే అది అనేయడం ఆయన స్టైల్. కేబినేట్ లో ఉండి ముఖ్యమంత్రిని తిట్టిన ఘనుడు బహుశా ఆయనే కావచ్చు..సీఎంపై విమర్శలు చేసి చేసి చివరకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు...ఆయనే కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. 2014 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో స్థబ్ధుగా ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  

గతంలో టీడీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిది. కానీ డీఎల్ ఎటు వెళ్లలేదు.2014 ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చెయ్యలేదు. కానీ మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్  కు మద్దతు ప్రకటించారు.  

అయితే ఆ ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఘోరంగా ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం పుట్టా సుధాకర్ యాదవ్ తో వచ్చిన విభేధాలతో డీఎల్ రవీంద్రారెడ్డి స్తబ్ధుగా ఉన్నారు. 
 
వాస్తవంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాస్త బహీనంగా ఉంది. ఉన్న కొద్దిమంది నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.  పార్టీలోని సమస్యలను చక్కదిద్దుతూనే బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అన్వేషణలో పడ్డారు. జగన్ ఇలాకాలో కనీసం ఐదు స్థానాలను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో మాత్రం టీడీపీ గెలిచింది. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేథప్యంలో బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునన్నారు. 

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాణ రెడ్డికి మంత్రి పదవి సైతం కట్టబెట్టారు. ఇకపోతే పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి మధ్య వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. అటు బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయరాముడుకు, మాజీ ఎమ్మెల్యే కమలమ్మల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉంది. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలోని విభేధాలను పక్కనపెట్టి గెలుపుగుర్రాలపై దృష్టిసారించారట సీఎం చంద్రబాబు నాయుడు. కడపలో వైసీపీకి గండికొట్టాలంటే బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటించిన మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో సంప్రదింపులు జరిపారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. 


భూమా నాగిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం....ఆ తర్వాత జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో  ఆ సమయంలోనే డీఎల్ సైకిలెక్కుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పుడు కూడా డీఎల్ మౌనంగానే ఉండిపోయారు. 

 ఇకపోతే తెలుగుదేశం పార్టీ తనకు టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతనే డీఎల్ ఎటూ తేల్చుకోలేకపోయారని టాక్. ఆరుసార్లు మైదుకూరు
మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డీఎల్ అదే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం మైదుకూరు నియోజకవర్గం పుట్టా సుధాకర్ యాదవ్ కు కేటాయించడంతో కడప పార్లమెంట్ కు పంపాలా అని డైలామాలో పడిందట.

ఈ నిర్ణయం డీఎల్ కు రుచించలేదని సమాచారం. అయితే ఇటీవల కాలంలో పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా నియమితులవ్వడంతో మైదుకూరు అసెంబ్లీ డీఎల్ కే ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇస్తూ మరోసారి రాయబారానికి పంపారట. కానీ డీఎల్ ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదట.

అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీఎల్ రవీంద్రారెడ్డితో తరచూ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు సమావేశమై పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. ఇప్పటికే మైదుకూరు నియోజకవర్గం వైసీపీ ఖాతాలో ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాన్ని 2019లో డీఎల్ రవీంద్రారెడ్డికే ఇస్తామని గట్టి హామీ ఇచ్చారట. 

మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రఘురామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని తెలిపారట. డీఎల్ రాజకీయంగా సీనియర్ నేత కావడం.....పుట్టా సుధాకర్ యాదవ్, మంత్రి ఆదినారాయణరెడ్డిలను ఢీకొట్టి సామర్థ్యం ఉండటంతో పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉందని భావించి అన్నిహామీలు ఇచ్చేసిందట. ఇప్పటికే డీఎల్ వైఎర్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.  

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెసుకు షాక్: వైసిపిలోకి మాజీ కేంద్ర మంత్రి?

సబ్బం రీ పొలిటికల్ ఎంట్రీ షురూ: ఏ పార్టీ?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios