Asianet News TeluguAsianet News Telugu

రా.. చూసుకుందాం: తొడగొట్టి జగన్‌కు సవాల్ విసిరిన అయ్యన్నపాత్రుడు

ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు.

ex minister chintakayala ayyanna patrudu Challenge To ap CM YS Jagan
Author
Visakhapatnam, First Published Jan 6, 2020, 4:21 PM IST

ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. టీడీపీ సత్తా ఏంటో పంచాయతీ ఎన్నికల్లో చూపిస్తామని తోడగొట్టి మరి అయ్యన్న సవాల్ విసిరారు.

స్థానిక ఎన్నికలకు 59 శాతం రిజర్వేషన్లు పెడితే కోర్టు ఎన్నికలు నిలిపివేస్తుందని, ఆ నింద టీడీపీపై మోపేలా కుట్రలు చేయొద్దని చింతకాయల హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేకనే ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. 

Also Read:మా నిర్ణయాన్ని చంద్రబాబుకి చెప్పాం... గంటా కామెంట్స్

కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసు  నమోదయ్యింది. పోలీసుల విధులకు భంగం కలిగించడమే కాకుండే వారిపై పరుష పదజాలంతో దూషణలు చేశాడన్న ఆభియోగాలపై ఆయన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఇటీవల అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీని వల్లే వివాదం రాజుకుని చివరకు అయ్యన్నపై కేసు నమోదయ్యే స్థాయికి చేరింది. 

నర్సీపట్నంలోని సన్యాసిపాత్రుడి నివాసంపై వైసిపి జెండా కట్టడం అయ్యన్న, సన్యాసి వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వీరిని సర్దిచెప్పి  పంపించారు. అయితే మళ్ళీ ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తపడ్డ పోలీసులు సన్యాసినాయుడితో పాటు అయ్యన్నపాత్రుడి ఇంటివద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు.

Also Read:అప్పుడు ఎందుకు తలొగ్గారు..? చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు

అయితే ఇంటివద్ద కాపలాగా వున్న పోలీసులతో మాజీ మంత్రి దురుసుగా వ్యవహరించినట్లు, పరుష పదుజాలంతో దూషించినట్లు సమాచారం. ఇలా పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం, దూషించడంపై పోలీస్ ఉన్నతాధికారులు  చర్యలు తీసుకున్నారు. మాజీ మంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలన్ని ఉన్నతాధికారుల ఆదేశాలతో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయ్యింది. 

గతంలో విశాఖపట్టణంలోని త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ లో  కూడా అయ్యన్నపాత్రుడుపై పోలీస్‌ కేసు నమోదైంది. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  ఆయనపై ఐపీసీ 153ఏ, 500,506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios