జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కల్యాణ్‌కు లేదని అన్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కల్యాణ్‌కు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చమెత్తుకుని 35 లేదా 40 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి సీఎం అభ్యర్థి ఎలా అవుతాడని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్.. భీమ్లా నాయక్‌ కాదని తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పవన్ కల్యాణ్ అభిమానులు తనపై ఎన్ని ట్రోల్స్ చేసుకున్న తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా టీడీపీ, జనసేనతో పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. తాను లోపల ఒకటి.. బయట ఒకటి మాట్లాడే మనిషిని కాదని.. ముక్కుసూటి మనిషినని అన్నారు. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని తన నియోజకవర్గంలోకి ఆహ్వానిస్తానని చెప్పారు. కుటుంబంలో గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటామన్నారు.

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు తనకు కాకాణి గోవర్దన్ రెడ్డి ఎంత గౌరవం ఇచ్చారో.. తాను ఆయనకు రెట్టింపు గౌరవం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సమన్వయకర్త అని.. ఆయన పార్టీ కోసం ఆయన ఎంతో చేశారని చెప్పారు.