కరోనా తప్ప అన్నీ కావాలి: జగన్‌పై చినరాజప్ప సెటైర్లు
కరోనా నియంత్రణ పై సిఎం జగన్ దృష్టి సారించకుండా ఇతర అంశాలపై శ్రద్ధ చూపిస్తున్నారు ఆరోపించారు టీడీపీ సీనియర్, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప
కరోనా నియంత్రణ పై సిఎం జగన్ దృష్టి సారించకుండా ఇతర అంశాలపై శ్రద్ధ చూపిస్తున్నారు ఆరోపించారు టీడీపీ సీనియర్, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విపత్కర పరిస్థితులలో రాజధానిపై మాట్లాడడం అవసరమా? అని ప్రశ్నించారు.
కరోనా నియంత్రణ విషయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు వసతులు లేవని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో అనంతపురం , గుంటూరులలో వైద్యం అందిస్తున్న డాక్టర్లకు కరోనా వైరస్ సోకడంతో వారిలో ఆందోళన మొదలైందని చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:కరోనా వైరస్: మరణించిన డాక్టర్ ఇంట్లో ఆరుగురికి కోవిడ్ -19 పాజిటివ్
కరోనా సోకడం వల్ల వైద్యులు వైద్యసేవలు చేయడానికి నిరాకరిస్తున్నారని.. ప్రభుత్వమే డాక్టర్లకు తగిన రక్షణ కల్పించాలని అవసరమైన మెడికల్ ఉపకరణాలు కిట్లు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
జనాభాకు తగినట్లుగా రాష్ట్రంలో కరోనా టెస్టులకు సరిపడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని అడగడం లేదు ఆయన ధ్వజమెత్తారు.
Also Read:ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 38 కేసులు, మొత్తం 572కి చేరిక
సీఎం రిలీఫ్ ఫండ్ కు అధిక మొత్తాలు అందుతున్న కారణంగా కరోనా నియంత్రణ ఖర్చులకు రెవెన్యూ , మున్సిపాలిటీలకు నిధులు రిలీజ్ చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.
వలస కార్మికులను తగిన వసతి, భోజనం సదుపాయం కల్పించాలన్నారు. కోతలు మొదలైనా కార్మికులు దొరక్క,యంత్రాలు లేక, కొనుగోళ్ళు లేక రైతు ఇబ్బందులు పడుతున్నారని నిమ్మకాయల ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ హోంమంత్రి కోరారు.