ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 38 కేసులు, మొత్తం 572కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 572కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 572కి చేరుకొన్నాయి.
కరోనా వైరస్ సోకి ఇప్పటికే రాష్ట్రంలో 14 మంది మృతి చెందారు. ఈ వైరస్ సోకిన వారిలో 35 మంది కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికి్త్స పొందుతున్న వారి సంఖ్య 523కి చేరుకొన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో ఐదు, చిత్తూరులో 5, గుంటూరులో 4, కడపలో1,కృష్ణాలో4, కర్నూల్ లో 13, నెల్లూరులో 6 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలోని గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 126, కర్నూల్ లో 126 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కర్నూల్ జిల్లాలో కొత్తగా 13 కేసులు నమోదు కావడంతో గుంటూరుతో ఈ జిల్లా సమానంగా నిలిచింది
also read:ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు... వైసిపి సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు
.ఆ తర్వాతి స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచింది.నెల్లూరులో 64 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.కృష్ణా తర్వాతి స్థానంలో ప్రకాశం జిల్లా నిలిచింది. ప్రకాశంలో42 కేసులు నమోదయ్యాయి.