అమరావతి: ఏపీ మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్ ఇచ్చారు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. అనిల్ చంద్ర పునేఠాను ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇకపోతే ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనిల్ చంద్ర పునేఠాను సీఎస్ బాధ్యతల నుంచి తప్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 

ఐపీఎస్ అధికారుల బదిలీపై సీఎస్ బదిలీలపై పలు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అనిల్ చంద్ర పునేఠాను తప్పించి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆనాటి నుంచి అనిల్ చంద్ర పునేఠా పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. తాజాగా మంగళవారం సాయంత్రం అనిల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.