అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని ఆరోపిస్తూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని లేఖలో పేర్కొన్నారు. 

ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.  అధికార ప్రభుత్వం వాక్ స్వాతంత్యాన్ని హరిస్తోందని ఆరోపించారు. గతంలో ఏపీ పోలీసులు సమర్థులనే పేరు ఉండేదని ప్రస్తుతం అది మారుతోందని స్పష్టం చేశారు. 

వైసీపీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉందని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని, దాన్ని కాపాడాలంటూ డీజీపీ గౌతం సవాంగ్ ను  చంద్రబాబు కోరారు.