14,140.44 కోట్ల నిధులతో ఏపీలో ఇళ్ల నిర్మాణం 4,20,312 ఇళ్లను నిర్మించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
మంత్రిగా ఉన్నంత కాలం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి అండదండలు అందించారు వెంకయ్య నాయుడు. చివరకు మంత్రి పదవి నుంచి తప్పుకునే ముందు కూడా ఏపీకి ఇళ్ల మంజూరు దస్త్రంపైనే చివరి సంతకం చేసారు. పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆయన నిర్ణయంపై , కేంద్ర గృహ నిర్మాణ శాఖ మానిటరింగ్ కమిటీ కూడా ఈ రోజు ఆమోదం తెలిపింది.
గతంలో కేంద్రం 1,95,067 గృహాలను మంజూరు చేసింది. వాటికి ఇప్పుడు మంజూరు చేసిన 2,25,245 ఇళ్లు తోడవడంతో మొత్తంగా 4,20,312 ఇళ్లను కేంద్రం రాష్ట్రంలో నిర్మించనున్నారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం 14,140.44 కోట్ల నిధులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయనున్నాయి.
ఈ విధంగా లక్షల గృహాలను నిర్మించడానికి కేంద్ర నిధులను రాష్ట్రానికి అందడంలో కేంద్ర మంత్రి చొరవను మర్చిపోమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆయన తన పదవీ కాలంలోనే కాదు, పదవి నుండి తప్పుకునే ముందు కూడా సొంత రాష్ట్ర ప్రయోజనాలనే కోరుకున్నారని బీజేపి నేతలు ఆయన్ని ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా 9 లక్షల ఇళ్లు మంజూరు కాగా, అందులో ఒక్క ఏపీకే 4 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఈ విధంగా ఏపీకి అధిక ప్రాదాన్యం ఇవ్వడానికి వెంకయ్య నాయుడే కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే.
వెంకయ్య ఉప రాష్ట్రపతిగా ఎన్నికై, రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.
