ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ సోమవారం గవర్నర్‌ను కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆ రోజు 11.30 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

హైకోర్టు ఆదేశాలతో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని ఏపీ హైకోర్టు మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించింది.

తనను ఎస్ఈసీగా నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శెుక్రవారం నాడు హైకోర్టు విచారించింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా నిమ్మగడ్డను ఏపీ ఎస్ఈ‌సీగా ఎందుకు నియమించలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఏపీ గవర్నర్ ను కలవాలని ఏపీ హైకోర్టు మాజీ ఎన్నికల సంఘం కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆదేశించింది.

ఈ కేసులో మూడు దఫాలు సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించినా కూడ ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎందుకు నియమించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.

అయితే ఎస్ఈసీగా రమేష్ కుమార్ ను నియమించే అధికారం తమకు లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ అధికారం గవర్నర్ కే ఉందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో గవర్నర్ ను కలవాలని హైకోర్టు ఆదేశించింది. మరో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎందుకు నియమించలేదో  కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తమ తీర్పును అమలు చేయాలని కోరుతూ గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని హైకోర్టు సూచించడంతో. ఏపీ గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకొన్నట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాయర్ హైకోర్టుకు వివరించారు. ఈ కేసు విచారణను  వచ్చే శుక్రవారం నాటికి వాయిదా వేసింది.