మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. తనకు సీబీఐ నుండి వైఎస్ వివేకానందరెడ్డి అనుచరుల నుండి ప్రాణ హాని ఉందని అనంతపురం ఎస్పీకి గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ ఒత్తిళ్లు తీసుకొచ్చిందని ఆరోపించారు.
అనంతపురం: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది. సీబీఐతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి అనుచరుల నుండి తనకు ప్రాణహాని ఉందని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీ ఫకీరప్పకు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.తనకు CBIరూ. 10 కోట్లు కూడా ఆఫర్ చేసిందని Gangadhar Reddy అనే వ్యక్తి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Ys Vivekananda Reddy హత్య కేసులో YS Avinash Reddy, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని తనపై సీబీఐ అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.తానే వైఎస్ వివేకానందరెడ్డిని చంపాలని ఒప్పుకోవాలని కూడా బెదిరించారని Anantapur SP ఎస్పీకి వివరించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు సంబంధం లేదన్నారు. ఈ ఫిర్యాదుపై ఎస్పీ Pakkirappa స్పందించారు. గంగాధర్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఆయనకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. సీబీఐతో పాటు వివేకానందరెడ్డి అనుచరులు, సీఐ శ్రీరాంపై గంగాధర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు.ఈ విషయమై డిఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామని ఎస్పీ చెప్పారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్టుగా గంగాధర్ చెబుతున్నారని ఎస్పీ తెలిపారు. గంగాధర్ రెడ్డి ఫిర్యాదులోని అన్ని అంశాలపై విచారణ చేస్తామని ఎస్పీ వివరించారు.
also read:Ys Vivekananda Reddy Murder case: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.సీబీఐ అధికారులు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని ఈ నెల 26న కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ ట్విస్ట్ చోటు చేసుకొంది. 2019 మార్చి 14న వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే దుండగులు హత్య చేశారు.ఈ కేసులో ఇప్పటికే నలుగురిపై సీబీఐ అభియోగాలను మోపింది. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి తో పాటు సునీల్ యాదవ్ లపై సీబీఐ అభియోగాలు మోపింది. పూర్తిస్థాయి చార్జీషీట్ ను కూడా త్వరలోనే దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.
వైఎస్ వివేకానందరెడ్డి వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐికి అప్రూవర్ గా మారాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు దస్తగిరి కీలక వాంగ్మూలం ఇచ్చాడు.ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టకు సమర్పించారు. ఈ ఏడాది ఆగష్టు 31న సీబీఐ అధికారులు ఈ వాంగ్మూలాన్ని కోర్టుకు అందించారు. 2019 ఫిబ్రవరి 19న ఎర్ర గంగిరెడ్డి నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర జరిగిందని దస్తగిరి వివరించారు. ఈ హత్య చేస్తే తనకు రూ. 5 కోట్లు ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి అడ్వాన్స్‌గా ఇచ్చారని చెప్పారు.దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ విచారణ చేస్తుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు సీబీఐ అధికారులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని విచారించనున్నారు.
