Asianet News TeluguAsianet News Telugu

పోతుల సునీత రాజీనామా: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది.
టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరిన పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది.
 

Election commission releases schedule for MLA quota MLC election in Andhra pradesh lns
Author
Guntur, First Published Jan 6, 2021, 1:37 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది.
టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరిన పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది.

also read:ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి జూలై 6న పోలింగ్: షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11 వతేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలు చేయడానికి ఈ నెల 18 చివరి తేదీ. ఈ నెల 28న పోలింగ్ ఉంటుంది. అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 

2020,  అక్టోబర్ 28వ తేదీన ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. మూడు రాజధానుల అంశంపై శాసనమండలిలో జరిగిన చర్చ సమయంలో విప్ ను ధిక్కరించిన పోతుల సునీత సమావేశాలకు గైరాజరయ్యారు. 

2020 జనవరి 22 వతేదీన టీడీపీకి గుడ్ బై చెప్పిన పోతుల సునీత వైఎస్ఆర్‌సీపీలో చేరారు. పోతుల సునీతతో పాటు శివనాథ్ రెడ్డిలపై టీడీపీ అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మెన్ కు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న సమయంలోనే పోతుల సునీత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios