టీడీపీ అనర్హత పిటిషన్: ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత బుధవారం నాడు రాజీనామా చేశారు. 15 నెలలుగా టీడీపీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా ఆమె ప్రకటించారు.
 

Pothula sunitha resings to  MLC post lns

అమరావతి: ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత బుధవారం నాడు రాజీనామా చేశారు. 15 నెలలుగా టీడీపీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా ఆమె ప్రకటించారు.

also read:మండలి ఓటింగ్ ఎఫెక్ట్: వైసీపీలోకి పోతుల సునీత?

టీడీపీ నుండి వైసీపీలో చేరిన  పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మెన్ కు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మెన్ షరీప్  విచారణ చేస్తున్నారు. కొన్ని సమయాల్లో విచారణకు సునీత హాజరు కాలేదు. టీడీపీ పిటిషన్ పై విచారణ సాగుతున్న సమయంలోనే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మెన్ షరీప్ కు ఆమె ఇవాళ పంపారు.

ఈ ఏడాది జనవరి 22 వ తేదీన పోతుల సునీత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్ విషయంలో టీడీపీకి ఆమె షాకిచ్చింది. టీడీపీ విప్ కు వ్యతిరేకంగా పోతుల సునీతతో శివనాథ్ రెడ్డిలు ఓటు వేశారు. వీరిద్దరూ ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

ఈ ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని  టీడీపీ మండలి ఛైర్మెన్ షరీఫ్ కు ఫిర్యాదు చేసింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios