చిత్తూరు: చిత్తూరు జిల్లాలో మంగళవారం నాడు విషాదం నెలకొంది. కరొనా సోకిన వృద్ధ దంపతులు మరణించారు.ఒకే కుటుంబానికి చెందిన దంపతులు మరణించడం గ్రామంలో విషాదాన్ని నింపింది.

జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలానికి చెందిన దంపతులు  ఇవాళ మృతి చెందారు. అబ్దుల్ రెహమాన్, సైదా నీ భార్య భర్తలు. ఇటీవల కాలంలో అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వారు పరీక్షలు చేయించుకొన్నారు. ఇద్దరికి కూడ కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు.

 దీంతో ఇవాళ ఉదయం 108 అంబులెన్స్ లో క్వారంటైన్ కి తరలిస్తుండగా రెహమాన్ మార్గమధ్యంలో మృతిచెందాడు. భర్త మృతి చెందిన విషయం గుర్తించిన భార్య సైదానీ కూడ మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించింది. ఇద్దరు కూడా క్షణాల వ్యవధిలోనే అంబులెన్స్ లోనే  మరణించారు. క్షణాల వ్యవధిలోనే కరోనా భయంతో మరణించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాటికి కరోనా కేసులు 6 లక్షల 31 వేల 749కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 6235 కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో సోమవారం నాటికి 5410 మంది మరణించారు.