Asianet News TeluguAsianet News Telugu

ఏపీ పదోతరగతి ఫలితాల విడుదల: బాలికలదే పైచేయి

ఏపీ పదవతరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మంగళవారం నాడు అమరావతిలో విడుదల చేశారు.
 

Education secretary sandhyarani releases Andhra pradesh tenth results
Author
Amaravathi, First Published May 14, 2019, 11:18 AM IST

అమరావతి:  ఏపీ పదవతరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మంగళవారం నాడు అమరావతిలో విడుదల చేశారు.

ఏపీ రాష్ట్ర పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సంద్యారాణి మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 18 నుండి పరీక్షలను నిర్వహించినట్టు చెప్పారు. 6 లక్షల 30వేల 82 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసినట్టుగా ఆమె తెలిపారు.

94.88 మంది ఉత్తీర్ణత సాధించినట్టుగా సంధ్యారాణి తెలిపారు. ఈ ఏడాది బాలుర కంటే బాలికలు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు.ఈ పరీక్షల్లో బాలురు 94.68 శాతం మంది ఉత్తీర్ణులైతే , బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆమె తెలిపారు.  

5464 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్టుగా ఆమె తెలిపారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిస్తే, నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచినట్టుగా ఆమె తెలిపారు. ఈ ఏడాది జూన్ 17వ తేదీ నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios