విశాఖపట్టణం: విశాఖపట్టణంలో హవాలా రాకెట్టులో కీలకపాత్ర పోషించిన  బీకే గోయల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 1500 కోట్లను హవాలా చేసినట్టుగా బీకే గోయల్ పై ఈడీ కేసు నమోదు చేసింది.  బీకే గోయల్ ను ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొన్నారు ఈడీ అధికారులు.

 వడ్డీ మహేష్ తో కలిసి దక్షిణ భారత దేశంలో పెద్ద మొత్తంలో హవాలా మార్గంలో డబ్బులను తరలించినట్టుగా ఈడీ గుర్తించింది. ఈ విషయమై 2017లోనే బీకే గోయల్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ కేసు నమోదైన నాటి నుండి గోయల్ తప్పించుకొని తిరుగుతున్నాడు.

చైనా, సింగపూర్, హాంకాంగ్ లలో బీకే గోయల్ తలదాచుకొన్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఈడీ అధికారులు గోయల్ ను రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రం తీసుకొన్న చర్యలతో అధికారులు బీకే గోయల్ ను అరెస్ట్ చేశారు. 

పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి డబ్బులను తరలించినట్టుగా ఈడీ గుర్తించింది. మరింత సమాచారాన్ని సేకరించేందుకు గాను ఈడీ అధికారులు బీకే గోయల్ నుండి మరింత సమాచారాన్ని సేకరించేందుకు గాను ఈడీ ఆయనను విచారించనున్నారు.