గోనె సంచుల మాటున సరఫరా: అనకాపల్లిలో రూ. 2.33 కోట్ల గంజాయి సీజ్

అనకాపల్లిలో డీఆర్ఐ అధికారులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. గోనె సంచలను మాటున గంజాయిని తరలిస్తున్నారని డీఆర్ఐ అధికారులు గుర్తించారు. వెయ్యి కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.

DRI Seizes 1,1693 Kgs Ganja in Anakapalle District

హైదరాబాద్:  Anakapalle వద్ద  సోమవారం నాడు భారీ మొత్తంలో గంజాయిని DRI  అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.1,169.3 కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు Seize చేశారు.  దీని విలువ రూ. 2.33 కోట్లుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Uttar Pradesh రాష్ట్రానికి చెందిన ట్రక్ విశాఖపట్టణం నుండి  Hyderabad వైపు వెళ్తుంది. ఈ ట్రక్  అనకాపల్లి జిల్లా గొబ్బూరు వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ట్రక్ లో గోనె సంచుల లోడ్ మధ్యలో గంజాయిని సరఫరా చేస్తున్నారు. ప్రమాదానికి గురైన సమయంలో ట్రక్ నుండి గంజాయి బయట పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో డీఆర్ఐ అధికారులు గంజాయిని సీజ్ చేశారు.

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుండి తెలుగు రాష్ట్రాలతో  పాటు దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతుంది. అంతేకదు డ్రగ్స్ కూడా విశాఖలో ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన ఘటనలు ఇటీవల కాలంలో నమోదౌతున్నాయి. 

ఈ ఏడాది జనవరి మాసంలో  విశాఖలో ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి డ్రగ్స్ సీజ్ చేశారు.   ఈ కేసులో ఒక యువతిని, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్వ, విశాఖకు చెందని హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీలుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. 

గత ఏడాది నవంబర్ మాసంలో  బెంగుళూరు నుండి కొకైన్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  కాలేజీ విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ తె్తున్నారని పోలీసులు గుర్తించారు. ఓ రౌడీషీటర్  డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు అధికంగా నమోదౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైద్రాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిఘాను పెట్టింది.  తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే  నార్కోటిక్ వింగ్ ను ఏర్పాటు చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios