విశాఖ నడిరోడ్డుపై అర్థనగ్నంగా పడుకున్న డాక్టర్ సుధాకర్: చంద్రబాబు స్పందన
ఇటీవల సస్పెన్షన్ కు గురైన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం నడిరోడ్డుపై హంగామా సృష్ఠించాడు.. విశాఖపట్నంలో అక్కయ్యపాలెంలో నడిరోడ్డుపై అర్థనగ్నంగా పడుకున్నాడు.
విశాఖపట్నం: ఇటీవల సస్పెన్షన్ కు గురైన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం నడిరోడ్డుపై హంగామా సృష్ఠించాడు.. విశాఖపట్నంలో అక్కయ్యపాలెంలో నడిరోడ్డుపై అర్థనగ్నంగా పడుకున్నాడు. దుర్భాషలాడుతూ వాహనదారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు.
అతి కష్టం మీద పోలీసులు డాక్టర్ సుధాకర్ ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. సంఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు విశాఖపట్నం పోలీసు కమిషనర్ మీనా చెప్పారు. మద్యం మత్తులో డాక్టర్ సుధాకర్ వీరంగం చేశాడని ఆయన చెప్పారు. ప్రజలు అదుపు చేయలేక పోలీసులకు సమాచారం ఇచ్చారని, పోలీసులపై కూడా తిరగబ్డడారని కమిషనర్ అన్నారు. న్యూసెన్స్ కింద సుధాకర్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నర్సీపట్నంలో ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. మాస్కులు లేవని ధ్వజమెత్తారు. దాంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడిని కలిసి వచ్చిన తర్వాత సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేశాడని అప్పట్లో అన్నారు.
read more ఏపీ సర్కార్ పై విమర్శలు: నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్, కేసు నమోదు
డాక్టర్ సుధాకర్ కు మానసిక స్థితి బాగా లేదనే మాట వినిపిస్తోంది. గతంలో కూడా ఆయన వివాదాలు సృష్టించాడు. రోగికి ఆపరేషన్ చేస్తూ మద్యలో వెళ్లిపోయిన సంఘటన కూడా ఉందని అంటున్నారు. మధ్యలోనే అతను వెళ్లిపోవడంతో మరో డాక్టర్ ను పిలిపించి ఆపరేషన్ పూర్తి చేయాల్సి వచ్చిందని అంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆయనకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
విశాఖలో డాక్టర్ సుధాకర్ మీద దాడిని ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలని ఆయన అన్నారు. ఒక వైద్యుడిని ఈ పరిస్థితికి తెచ్చినందుకు సిగ్గుపడాలని ఆయన అన్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ కారణమని ఆయన అన్నారు.