వాళ్లే చొక్కా చించి, అర్ధనగ్నం చేశారు, చేతులు కట్టేసి పడేశారు: డా. సుధాకర్
విశాఖపట్నం నడిరోడ్డుపై తాను బైఠాయించి హంగామా చేసినట్లు పోలీసులు చేసిన ఆరోపణలపై డాక్టర్ సుధాకర్ తన వాంగ్మూలంలో వివరించారు. పోలీసులే కుట్రపూరితంగా తనను ఇలా చేశారని ఆరోపించారు
అమరావతి: విశాఖపట్నంలో తనను పోలీసులు అరెస్టు చేయడానికి దారి తీసిన సంఘటనలపై డాక్టర్ సుధాకర్ తన వాంగ్మూలంలో వివరించారు. అంతా పోలీసులే చేశారని ఆయన ఆరోపించారు. మెజిస్ట్రేట్ కు శుక్రవారం ఇచ్చిన వాంగ్మూలంలో ఆ రోజు జరిగిన సంఘటనను వివరించారు.
ఈ నెల 16వ తేదీన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వారికి చెక్కు ఇచ్చేందుకు అనకాపల్లిలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్ చేసేందుకు బయలుదేరానని, మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు ఓకరు లిఫ్ట్ అడిగారని, మరొకరు తనను అనుసరించడం గమనించానని సుధాకర్ చెప్పారు.
దోపిడీ భయంతో అనకాపల్లి వెళ్లడాన్ని విరమించుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుని కారు రైట్ టర్న్ తీసుకున్నానని, తాను మధుమేహ బాధితుడిని అయినందున మూత్ర విసర్జన చేయడం కోసం పోర్ట్ హాస్పిటల్ సమీపంలో కారు ఆపానని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఇద్దరుట్రాఫిక్ పోలీసులు తన వద్దకు వచ్చి తన సస్పెన్షన్ గురించి ఇతర విషయాలు అడుగుతూ తనను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
Also Read: మహిళా పోలీసు చేయి పట్టుకుని తనను వదలాలని ఏడ్చింది: డా. సుధాకర్
కారు నుంచి తాళాలు, మొబైల్, ఏటిఎం కార్లులున్న పర్సు తీసుకున్నారని చెప్పారు. తన చొక్కా చించి, తనను అర్ధనగ్నం చేశారని, రక్షక్ కు ఫోన్ చేశారని ఆయన చెప్పారు .కారు ఫ్రంట్ సీటులో ఉ్న రూ.10 లక్షులు తీసుకుని మూడు విస్కీ బాటిళ్లు పెట్టిన విషయాన్ని తాను గుర్తించానని ఆయన చెప్పారు.
లాఠీలతో, బూట కాళ్లతో, చేతులతో విపరీతంగా కొట్టారని, అక్కడి నుంచి తాను పారిపోయేలా చేయాలని చూశారని సుధాకర్ చెప్పారు. తాను తాగిన స్థితిలో ఉన్నానని, పిచ్చివాడినని చెప్పడానికి వారు కేకలేశారని, తనను ఉద్యోగం నుంచి తొలగించాలనే కుట్ర ఇందులో ఉందని గుర్తించానని ఆయన అన్నారు.
Also Read: డా. కోలవెంటి సుధాకర్: ‘కులము’ – ‘మీడియా’ వొక లోచూపు
ఆటో రిక్షాలో తనను 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లారని, పోలీసు స్టేషన్ లో రెండు గంటల పాటు తన చేతులు వెనక్కి క్టటి నేల మీద పడేశారని ఆయన చెప్పారు. సమాచారం తెలిసి తన తల్లి స్టేషన్ కు వచ్ిచందని, తనను కేజీహెచ్ కు మార్చారని, రెండు గంటల తర్వాత కేజిహెచ్ క్యాజువాలిటీ నంచి మానసిక వైద్యశాలకు మార్చారని ఆయన చెప్పారు.