మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతి:హైకోర్టులో జేసీ ప్రభాకర్ రెడ్డి పిటిషన్
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతి కోరుతూ ఏపీ హైకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతి కోరుతూ ఏపీ హైకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.
జేసీ దివాకర్ రెడ్డితో పాటు మరో నలుగురు ఇదే రకమైన పిటిషన్లు దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించినట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.
పంచాయితీ ఎన్నికల్లో నేతలు పనిచేయలేదన్నారు. వలంటీర్లే పనిచేశారని ఆయన చెప్పారు. వలంటీర్ల బెదిరింపు కారణంగానే వైసీపీకి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల అంశం కోర్టులో ఉందన్నారు. నామినేషన్ల సమయంలో తమ పార్టీకి చెందినవారిని బెదిరించిన సాక్ష్యాలను కోర్టుకు అందించినట్టుగా ఆయన చెప్పారు.జేసీ ప్రభాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.
మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నేతలు నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకొన్నారని రెండు రోజుల క్రితమే జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.