Asianet News TeluguAsianet News Telugu

ఒకరికొకరం గౌరవం ఇచ్చిపుచ్చుకునేవాళ్లం.. వైఎస్‌తో అలా, కానీ జగన్: చంద్రబాబు

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను అసెంబ్లీలో ఒకరికొకరం గౌరవం ఇచ్చిపుచ్చుకున్నామని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు

dp chief chandrababu remembering ys rajasekhara reddy attitude  in assembly,
Author
Amaravathi, First Published Jan 24, 2020, 8:44 PM IST

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను అసెంబ్లీలో ఒకరికొకరం గౌరవం ఇచ్చిపుచ్చుకున్నామని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండ్రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.

తమ సభ్యులను వారు భయభ్రాంతులకు గురిచేశారని బాబు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీలకు భరోసానిచ్చారు. మండలి ఎట్టి పరిస్ధితుల్లోనూ రద్దు కాదని తెలిపారు.

Also Read:మండలి రద్దు భయం వద్దు: ఎమ్మెల్సీలకు చంద్రబాబు భరోసా

సభలో మొదటి రోజు మొత్తం తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. స్పీకర్‌కు స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ప్రతిపక్షాన్ని బయటకు నెట్టామన్నారని బాబు ఎద్దేవా చేశారు. కౌన్సిల్‌ గ్యాలరీలో కూర్చొన్న తనను బయటకు పంపించే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మండలి ఛైర్మన్‌ను ఆయన రూంలోనే కొట్టేందుకు యత్నించారని చంద్రబాబు ఆరోపించారు. తీవ్రవాద గ్రూప్‌ల నుంచి తీసుకువచ్చి సీతక్క, పోతుల సునీతకు టిక్కెట్లు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. పోతుల సునీతకు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని.. ఓడిపోతే ఎమ్మెల్సీని చేశామని, ఆమెకు ఎం తక్కువ చేశామని బాబు ప్రశ్నించారు.

Also Read:ప్రాసెస్ పూర్తి కాలేదు, ట్విస్టిచ్చిన షరీఫ్: టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

మండలిలో మెజారిటీ ఉందని తమకు ముందే తెలుసునని, 9 మందితో గెలుస్తామని ఎలా అనుకున్నారని ఆయన అన్నారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేకపోతే మూడు రాజధానులు బిల్లు ఎందుకు పెట్టారని బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios