చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు కాకినాడ ఎన్నికల్లో అతి విశ్వాసం పనికిరాదని నేతలకు సూచన. తప్పకుండా గెలవాలని పెర్కొన్నారు.
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపు పై అతి విశ్వాసం వద్దని పార్టి నేతలకు సూచించారు నారా చంద్రబాబు నాయుడు. 48 డివిజన్లలోనూ టీడీపీ గెలిచి తీరాలని అన్నారు. కాకినాడ ఎన్నికలపై పార్టీ నేతలతో ఆయన విజయవాడ నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాకినాడ ప్రచారంలో ఉన్న టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ.. మూడేళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపైనే ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను గెలిచి తీరాలని చంద్రబాబు, నేతలకు సూచించారు. అదేవిధంగా భాజపాకు కేటాయించిన డివిజన్లలోనూ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. అతివిశ్వాసంతో ఉండొద్దని పెర్కొన్నారు. గెలుస్తామనుకోవడం వేరు.. గెలవడం వేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వాడ వాడకు తిరిగి ప్రచారం చెయ్యాలన్నారు.
