కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఎన్నికలకు ముందు కోర్ట తీర్సు కెఇ కృష్ణమూర్తి కుటుంబానికి పెద్ద దెబ్బగానే చెప్పాలి. దాదాపు ఏడాది క్రితం కర్నూలు జిల్లాలోని పత్రికొండ నియోజకవర్గం వైసిపి ఇన్చార్జి చెఱుకులపాటు నారాయణరెడ్డిని ప్రత్యర్ధులు హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ హత్యలో కొంతమందిని పోలీసులు పట్టుకున్నా అసలు సూత్రదారులను మాత్రం పోలీసులు పట్టుకోలేదంటూ నారాయణ రెడ్డి కుటుంబం ఆరోపించింది. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబే అసలు సూత్రదారంటూ నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి కోర్టును ఆశ్రయించింది.

దాంతో కోర్టు జోక్యంతో శ్యాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటి వరకూ శ్యాంబాబును పట్టించుకోని ఎస్ఐ పై క్రమశిక్షణ చర్యలకు కూడా కోర్టు సిఫారసు చేయటం అప్పట్లో సంచలనం రేపింది. అటువంటిది ఆ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్‌ బాబుతో సహా మరో ఇద్దరు అప్పటి జెడ్పీటీసీ కపట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌లను నిందుతులుగా పేర్కొంటూ వెంటనే అరెస్ట్‌ చేయాలని శుక్రవారం డోన్‌ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.