చిత్తూరు:  ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన దంపతులకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కీలక విషయాన్ని ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఇద్దరు కూతుళ్లను చంపిన పురుషోత్తంనాయుడు, పద్మజలకు  పోలీసులు మంగళవారం నాడు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల సమయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. పురుషోత్తంనాయుడు భార్య పద్మజ తీవ్ర మానసిక వ్యాధితో బాధపడుతోందని డాక్టర్ రాధిక తెలిపారు.తన సమస్యను భర్త, కూతుళ్లకూ కూడ అంటించిందని  డాక్టర్ తెలిపారు. పురుషోత్తంనాయుడికి కూడ మానసిక సమస్య వచ్చిందన్నారు. 

also read:మానసికంగా బాగానే ఉన్నారు: కూతుళ్లను చంపిన పేరేంట్స్‌పై డీఎస్పీ మనోహరాచారి

పద్మజ తండ్రి ఇటీవలనే మానసిక వ్యాధితో మరణించాడని ఆమె గుర్తు చేశారు. పద్మజ మేనత్త కూడా మానసిక వ్యాధిగ్రస్తురాలలేనని డాక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.చికిత్స తీసుకొంటే పురుషోత్తం, పద్మజ వ్యాధి నుండి కోలుకొంటారని ఆమె తెలిపారు. 

ఈ నెల 24వ తేదీన మదనపల్లిలో  ఇద్దరు పిల్లలను పురుషోత్తంనాయుడు ఆయన భార్య పద్మజ కొట్టి చంపారు. చనిపోయిన తర్వాత తిరిగి బతికి వస్తారని వీరు భావించారు.