నెల్లూరు ప్రభుత్వాసుపత్రి ఎంఐసీయూ వార్డులో ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో డీఎంహెచ్‌వో స్పందించారు. అనారోగ్యం కారణంగా రోగులు చనిపోయారని ఆయన తెలిపారు. 

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంఐసీయూ వార్డులో ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అందక వీరు చనిపోయారని రోగులు ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై డీఎంహెచ్‌వో డాక్టర్ పెంచలయ్య విచారణ చేపట్టారు.దీనిలో భాగంగా రోగుల కేస్ షీట్లు, రికార్డులను పరిశీలించారు. అనారోగ్యం కారణంగా రోగులు చనిపోయారని.. వైద్యుల నిర్లక్ష్యం వున్నట్లుగా వస్తున్న వార్తలను డాక్టర్ పెంచలయ్య ఖండించారు. ఈ ఘటనపై త్వరలోనే జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం.. ఎంఐసీయూ వార్డులో ఒకే రోజు ఆరుగురు మృతి..!!

అంతకుముదు ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆరుగురు రోగులు వివిధ రకాల వ్యాధులతో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారని తెలిపారు. అక్కడ పరిస్ధితి విషమించడంతోనే జీజీహెచ్‌కు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ తాము చికిత్స అందించేందుకు ప్రయత్నించామని... కానీ వారి పరిస్ధితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని.. అదే జరిగితే ప్రమాదం ఊహించడానికి కూడా దారుణంగా వుండేదన్నారు.