పార్టీ మారనున్న టీడీపీ ఎమ్మెల్యే మేడా..?

did rajampet MLA ready to join in ycp?
Highlights

ఈయన వైసీపీలో చేరనున్నారని జిల్లాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం విస్తృతంగా జరుగడంతో... ముఖ్యమంత్రి దాకా విషయం వెళ్లింది. దీంతో.. ఈ ఎమ్మెల్యేను సీఎం కలావాలని కూడా ఆదేశించారు. 

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో ఉంటే తమకు లాభంగా ఉంటుందో చెక్ చేసుకొని మరి పార్టీ మారుతున్నారు. తాజాగా.. మరో టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆయనే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ఈయన వైసీపీలో చేరనున్నారని జిల్లాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం విస్తృతంగా జరుగడంతో... ముఖ్యమంత్రి దాకా విషయం వెళ్లింది. దీంతో.. ఈ ఎమ్మెల్యేను సీఎం కలావాలని కూడా ఆదేశించారు. అయితే.. కొన్నికారణాల వల్ల ఆయనకు చంద్రబాబుని కలవడం కుదరలేదు. దీంతో.. పార్టీ మారడం ఖాయం అని అందరూ భావించారు.

తాజాగా.. ఎమ్మెల్యే మేడా.. ముఖ్యమంత్రిని కలిశారు. 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇదే విషయం ముఖ్యమంత్రికి కూడా తెలియజేసినట్లు మేడా వివరించారు. 

loader