జెసి గోడవతో తనకు ఏమీ సంబంధం లేదని గతంలోనే అశోక్ స్పష్టంగా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, గొడవతో సంబంధం లేదని చెప్పిన కేంద్రమంత్రి జెసికి బోర్డింగ్ పాస్ ఎలా ఇప్పించారన్నది ప్రశ్న. అదే విషయమై జెసి రిపబ్లిక్ తో మాట్లాడుతూ ‘అశోక్ రాజకీయనేతగా పనిచేయటం లేదు, ఓ అధికారిలాగ పనిచేస్తున్న’ట్లు వ్యాఖ్యానించటం కొసమెరుపు.

Scroll to load tweet…

పాపం అశోక్ గజపతిరాజు అడ్డంగా దొరికిపోయారు. పార్టీ నేత, సహచర ఎంపి కదాని అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డికి సాయం చేసినందుకు రాజుగారే దొరికిపోయారు. విశాఖపట్నం విమానశ్రయంలో జెసి చేసిన వీరంగం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా? లేటుగా వచ్చి బోర్డింగ్ పాస్ ఇవ్వాలని గొడవపడటం, వాళ్లు కుదరదని చెప్పినందుకు ప్రింటర్ తదితరాలను క్రిందపడేయటం చేసారు. దాంతో కొన్ని విమానయాన సంస్ధలు జెసిని విమాన ప్రయాణం నుండి నిషేధించాయి.

అయితే, విశాఖపట్నం విమానాశ్రయంలో గొడవ జరిగినపుడు అక్కడే ఉన్న విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును జెసి కలిసారు. దాంతో రాజుగారు జోక్యం చేసుకుని అధికారులకు చెప్పి జెసికి బోర్డింగ్ పాస్ ఇప్పించారు. తర్వాత విచారణ చేయటం, తప్పు జెసిదే తప్పని అశోక్ ఒప్పుకున్నారు కూడా. విమానయాన సంస్ధలు ఒకవైపు జెసి ప్రయాణాన్ని నిషేధిస్తుండగానే జెసి కుటుంబసభ్యులతో కలిసి ప్యారిస్ కూడా చెక్కేసారు.

సరే అదంతా గతమైపోయిందనుకోండి. అయితే, తాజాగా జెసి రిపబ్లిక్ టివితో మాట్లాడుతూ, విమానాశ్రయం నుండి హైదరాబాద్ కు వచ్చేందుకు తానకు బోర్డింగ్ పాస్ ఇప్పించిందే అశోక్ గజపతిరాజంటూ పెద్ద బాంబునే పేల్చారు. అంటే మహారాష్ట్రలోని శివసేన ఎంపికి ఒక రూలు, తమ పార్టీ ఎంపికైతే మరో రూలా అంటూ అప్పుడే అశోక్ పై విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి కూడా. జెసి గోడవతో తనకు ఏమీ సంబంధం లేదని గతంలోనే అశోక్ స్పష్టంగా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, గొడవతో సంబంధం లేదని చెప్పిన కేంద్రమంత్రి జెసికి బోర్డింగ్ పాస్ ఎలా ఇప్పించారన్నది ప్రశ్న. అదే విషయమై జెసి రిపబ్లిక్ తో మాట్లాడుతూ ‘అశోక్ రాజకీయనేతగా పనిచేయటం లేదు, ఓ అధికారిలాగ పనిచేస్తున్న’ట్లు వ్యాఖ్యానించటం కొసమెరుపు.