కర్నూలు జిల్లా తెర్నేకల్‌లో అతిసార వ్యాధి ప్రబలుతోంది. వారం రోజులుగా గ్రామస్తులు అతిసారంతో బాధపడుతున్నారు. అయితే ఒకరు మరణించగా, మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు

కర్నూలు జిల్లా తెర్నేకల్‌లో అతిసార వ్యాధి ప్రబలుతోంది. వారం రోజులుగా గ్రామస్తులు అతిసారంతో బాధపడుతున్నారు. అయితే ఒకరు మరణించగా, మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు.

కర్నూలు, కోడుమూరు, ఆదోని ఆసుపత్రుల్లో చేరారు బాధితులు. వ్యాధి విజృంభిస్తున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు డిసెంబర్‌ నెలలోనూ కోసిగి మండలం జంపాపురం, సజ్జల గుడ్డం గ్రామాల్లో కలుషితమైన తాగునీరు తాగిన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ప్రభుత్వ అధికారులుగాని, వైద్యసిబ్బందిగాని ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ట్యాంకులు కూడా శుభ్రం చేయక పోవడంతో తాగు నీటిట్యాంకుల నుంచి దుర్వాసన వస్తోందని జనం మండిపడుతున్నారు.