Asianet News TeluguAsianet News Telugu

సంగం డెయిరీ.. పాల ఉత్పత్తిదారులందరి ఆస్తి: ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యలు

సంగం డెయిరీ... పాల ఉత్ప‌త్తిదారుల‌ ఆస్తి అన్నారు ఆ డెయిరీ ఛైర్మ‌న్‌, టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. డెయిరీలో జూన్ 1 నుంచి కిలో వెన్న‌కు రూ.710 చెల్లించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడ‌లో ధూళిపాళ్ల నరేంద్ర అధ్యక్షతన సంగం డెయిరీ పాల‌క వ‌ర్గం స‌మావేశ‌మైంది

dhulipalla narendra kumar comments on sangam dairy ksp
Author
Vijayawada, First Published May 29, 2021, 9:45 PM IST

సంగం డెయిరీ... పాల ఉత్ప‌త్తిదారుల‌ ఆస్తి అన్నారు ఆ డెయిరీ ఛైర్మ‌న్‌, టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. డెయిరీలో జూన్ 1 నుంచి కిలో వెన్న‌కు రూ.710 చెల్లించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడ‌లో ధూళిపాళ్ల నరేంద్ర అధ్యక్షతన సంగం డెయిరీ పాల‌క వ‌ర్గం స‌మావేశ‌మైంది. ప్ర‌భుత్వ ప‌రంగా ఎదుర‌య్యే అడ్డంకుల‌ను అధిగ‌మించాల‌ని తీర్మానించారు. ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర‌ మాట్లాడుతూ.. ప‌ది శాతం వెన్న ఉన్న గేదె పాలు లీట‌ర్‌కు రూ.71.50 చెల్లిస్తామ‌న్నారు. ప‌శు దాణాకు సేక‌రించే మొక్క‌జొన్న‌ల ధ‌ర రూ.1,700గా నిర్ణ‌యించామ‌ని తెలిపారు. ఈ ఏడాది రూ.2 వేల ట‌న్నుల మొక్క‌జొన్న కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామ‌ని నరేంద్ర వెల్లడించారు.   

Also Read:జైలు నుంచి విడుదలైన ధూళిపాళ్ల నరేంద్ర.. నెల రోజులు బెజవాడకే పరిమితం

త్వ‌ర‌లోనే చిత్తూరు జిల్లా కుప్పంలో పాల శీత‌లీక‌ర‌ణ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని న‌రేంద్ర‌ పేర్కొన్నారు. అలాగే  నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరిలో ఐదు వేల లీట‌ర్ల సామ‌ర్థ్యంతో బ‌ల్క్ కూల‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సంగం ఛైర్మన్ తెలిపారు. 50 శాతం రాయితీతో పాలు పితికే యంత్రాలు, బ్ర‌ష్ క‌ట్ట‌ర్లు పంపిణీ చేస్తామ‌ని ధూళిపాళ్ల నరేంద్ర వివ‌రించారు. కాగా, సంగం డెయిరీలో అవకతవకలు చోటుచేసుకున్నాయ‌నే అభియోగంపై ధూళిపాళ్ల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios